మరికాసేపట్లో పాతబస్తీకి సీఎం యోగి…పోలీసులు అలెర్ట్ !

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య నాథ్ పాత బస్తీ పర్యటన తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అయితే.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య నాథ్… ఇవాళ ఉదయం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్

గతంలో మొక్కు వుండడం వల్ల ఇవాళ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం కు యోగి రానున్నారని తెలిపారు. షెడ్యూల్ లో మార్పు ఉండడం వల్లనే నిన్న భాగ్యలక్ష్మి టెంపుల్ కి యోగి రావడం లేదని వెల్లడించారు. యోగి ఏ సమయానికి భాగ్యలక్ష్మి టెంపుల్ కి వస్తారనేది తొందర్లో షెడ్యూల్ టైం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

నేడు హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ ఐకానిక్ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ సందర్శించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.