ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందశాతానికి మించి అధిక వర్షపాతం నమోదు

-

వరంగల్ పరిధిలో నాలుగు జిల్లాల్లో సీజన్ మొదలైన జూన్ 1 నుంచి జులై 12 వరకు ఏకంగా వందశాతానికి మించి అధిక వర్షపాతం నమోదైంది.ములుగు జిల్లాల్లో 272.7 శాతం వర్షపాతం అధికంగా కురిసింది.భూపాలపల్లి జిల్లాలో 153 , మహబూబాబాద్లో 147 , జనగామలో 109 శాతం నమోదైంది . వరంగల్ జిల్లాలో సాధారణంకన్నా 95 , హనుమకొండ జిల్లాలో 88 శాతం అధిక వర్షపాతం కురిసింది . వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉండడంతో బల్దియా అప్రమత్తమైంది.

ముందస్తు జాగ్రత్తగా రంగంలోకి దిగాయి ఎన్టీఆర్ఎఫ్ బలగాలు. జిల్లా పరిధిలో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది . 70 శాతం చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్లు నీటిపారుదలశాఖ అధికారులు వెల్లడించారు . ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం 5,241 చెరువులు ఉండగా అందులో అలుగు పోస్తున్నవి 1995, పూర్తి స్థాయిలో నిండినవి 1549 , రెండు మూడు రోజుల్లో ఇవి కూడా అలుగు పారే అవకాశం ఉంది.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 చెరువుల కట్టలు ఉన్నాయి.అందులో కాలువలకు గండ్లు పడినవి.. నెక్కొండలో 2 , భూపాలపల్లిలో 2, దుగ్గొండి లో 3, నర్సంపేటలో 2, గీసుకొండలో 1, ఏటూ నాగారంలో 1, చెన్నారావుపేటలో, వెంకటా పూర్లో1, గోవిందరావుపేటలో 1 .

Read more RELATED
Recommended to you

Latest news