కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు ఖరారు !

-

తెలంగాణలో హడావీడి కొనసాగుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, వెండి, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటివి పట్టుబడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే.. కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు ఖరారు అయింది.

సిపిఐకి కోత్తగూడెం సీటు, మరో ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే, మునుగోడులో పోటీ వద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించగా, శనివారం రాత్రి బేటిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిపిఎంతో పొత్తుపైన సిపిఐ నేతలు ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలో ఓ సీటును సిపిఎం కు కేటాయించాలని సిపిఐ నేతలు సూచించగా, కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సిపిఎంతో చర్చిస్తున్నారని రేవంత్ తెలిపారు. అటు సీపీఎం పార్టీ సొంతంగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version