జగిత్యాల ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరడంతో మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతలు, పెద్దలు ఆయణ్ను బుజ్జగించేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు రెండ్రోజుల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని పార్టీలో కొనసాగుతానని చెప్పారు.
ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్న జీవన్ రెడ్డి మరోసారి మనస్తాపానికి గురయ్యారు. జగిత్యాలలో ఆయన ఉన్న ప్లెక్సిని తొలగించటంపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని 8 వార్డులో బోనాల పండగ సందర్భంగా ప్లెక్సి ఏర్పాటు చేశారు. బోనాల పండగలో పాల్గొనేందుకు వెళ్లి వస్తుండగా ప్లెక్సిని మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుండగా జీవన్‌రెడ్డి గమనించారు. ప్లెక్సీని ఎవరు తీయమన్నారని ప్రశ్నించారు. టీపీఎస్ తీయమంటే తీస్తున్నామంటూ సిబ్బంది చెప్పగా.. అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లెక్సిలో ఉన్న ఉద్యోగుల ఫోటోను మాస్క్ వేయాలని మాత్రమే సూచించానని మున్సిపల్ టీపీఎస్ తెజస్విని తెలిపారు.