రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ లో స్వల్ప మార్పులు…. బహిరంగ సభతో పాటు ర్యాలీ

-

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఇప్పటికే ఖరారైంది. అయితే రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ. మే 6,7న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మే6న వరంగల్ లో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే బహిరంగ సభతో పాటు ర్యాలీ కూడా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మే 6న 2 గంటలకు హైదరాబాద్ కు చేరుకుని … అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి చేరుకుని.. అక్కడ నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు.rahul gandhi మే 7న తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులు, రైతుల కుటుంబాలతో పాటు కాంగ్రెస్ నేతలతో హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతుండటంతో కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ పర్యటన చేస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటన సక్సెస్ అయ్యేలా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశం అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news