తెలంగాణ ప్రజలపై పెను భారం.. ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న కరెంట్‌ ఛార్జీలు !

-

తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ లోటు తో కొనసాగుతుండటం అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అనిపించకపోవడం కారణంగా ఈ భారమంతా తెలంగాణ వినియోగదారుల పైన ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ చార్జీల షాక్.. తప్పేలా కనిపించడం లేదు.

డి స్కాములు సమర్పించిన ఏ ఆర్ ఆర్ ఈ అంశాన్ని చెబుతున్నాయి. ప్రస్తుతం 2021-22, వచ్చే 2022-23 ఆర్థిక సంవత్స రాలకు కలిపి డిస్కాములు ఏకంగా… రూ. 21550 కోట్ల లోటు ను కలిగి ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలానికి గాను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఈ ఆర్ సి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల లో… డిస్కాంలు ఈ విషయాన్ని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోనూ… కూడా ఇంత భారీ లోటుతో ఉన్నట్లు తెలిపాయి. టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాకే తాము ముందుకు వెళతామని టీఎస్‌ ఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీరంగారావు తెలిపారు. దీంతో.. ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి కరెంట్‌ ఛార్జీలు పెంచే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news