తెలంగాణ సర్కార్‌ కు దానం వార్నింగ్‌..మీరు వస్తుంటారు…పోతుంటారు..నేను పక్కాలోకల్ ?

-

తెలంగాణ సర్కార్‌ అధికారులకు బీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. హైదరాబాద్ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై దానం నాగేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందని…. అందుకే నాపై కేసు పెట్టారని మండిపడ్డారు దానం నాగేందర్‌. అధికారులు వస్తుంటారు..పోతుంటారు, కానీ నేను లోకల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Danam nagendhar angry with Hydra Commissioner AV Ranganath

నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ ఘటనపై..అధికారులకు ప్రివిలేజ్‌ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు బీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని… సీఎం రేవంత్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని వార్నింగ్‌ఇచ్చారు బీఆర్‌ఎస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌. హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తున్నారు….నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్ లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం మీకు ఎవ్వరు ఇచ్చారన్నారు. పార్కు స్థలం అని చెప్పి EVDM వాళ్ళు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారు….బస్తి వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు ? అని ప్రశ్నించారు. నాపై 190 కేసులు ఉన్నాయి..కేసులకు భయపడనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version