కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదు: డీకే అరుణ

-

తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల తొలి లిస్టు ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండో జాబితాకు రంగం సిద్ధం చేస్తూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓవైపు ప్రచారంలో బిజీగా ఉంటూనే మరోవైపు తమ కేడర్​ను బలపరుచుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నేతల పార్టీల జంపింగ్​లు రాష్ట్రంలో చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. కీలక నేతలు టికెట్ ఆశించి భంగపడటంతో ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు.

ఇక ఇప్పటికే పార్టీ మారిన కొంతమంది నేతలు తిరిగి సొంత గూటికి చేరతారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా తిరిగి హస్తం గూటికి చేరతారంటూ ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై డీకే అరుణ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్​లో అస్సలు చేరబోనని తేల్చి చెప్పారు. బీజేపీ అధిష్ఠానం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చిందని.. మోదీ నాయకత్వంలో పని చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version