యూత్ కు సిఎం కేసీఆర్ శుభవార్త..గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్ర యువతకు సిఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణ లోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5 వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమీటీల’’ను ఏర్పాటు చేయాలన్నారు.

cm-kcr-telangana
cm-kcr-telangana

గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని సిఎం తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ దినోత్సవం నాడు ఎంపిక చేసిన కొన్ని గ్రామల్లొ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు.కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. వాళ్లదంతా చిల్లర వ్యవహారమని ఆగ్రహించారు. నేరుగా పల్లెలకు కేంద్రం నిధులు పంపడం చిల్లర వ్యవహారమని ఫైర్‌ అయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా కేంద్రమే పథకాలు అమలు చేయాలనుకోవడం సరికాదని అభిప్రాయ పడ్డారు సీఎం కేసీఆర్‌. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని స్ఫష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news