కేసీఆర్ ను పీకేలు కాపాడలేరు..ప్రజలు బండకేసి కొడతారు : ఈటల

సీఎం కేసీఆర్ ను ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా అని… 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ ను మింగిన చరిత్ర కేసీఆర్ ది అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను పీకేలు కాపాడలేరు. తెలంగాణలో చైతన్యమే నిలిచి గెలుస్తుందని చెప్పారు. గవర్నర్ ను అవమానించిన దేశంలోనే నీచపు, చిల్లర ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. హరీష్ రావుది దొంగలెక్కలు.. కాకి లెక్కల బడ్జెట్ . కాగ్ నివేదిక చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాగుడు వలన తెలంగాణలో భర్తలు లేని ఆడబిడ్డలు పెరిగిపోతున్నారని.. నియంత్రుత్వ పోకడలు పోయి‌న వారికి పట్టినగతే కేసీఆర్ కు పడుతోందన్నారు. మా హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ హరించారని.. పది నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం ముఖ్యమంత్రి, స్పీకర్ కు ఉండదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్లిప్పుతో మమ్ముల్ని సభాపతి సస్పెండ్ చేశారని ఆగ్రహించారు. సస్పెండ్ చేయడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని.. కోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్పీకర్ గౌరవించలేదని ఫైర్ అయ్యారు ఈటల.