Telangana: అకాల వర్షంతో అన్నదాతలకు మిగిలిన కన్నీరు

-

Telangana: తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్‌ షాక్‌ తగిలింది. అకాల వర్షంతో అన్నదాతలకు కన్నీరు మిగిలింది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌…ఇంకా వడ్లు కొనకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు అన్నదాతలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి తీవ్రంగా నష్టపోయారు రైతన్నలు.

Farmers who were severely affected by the rain yesterday evening

సంగారెడ్డి జిల్లా జోగిపేట.. మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డు, కల్లాల వద్ద తడిచింది వరి ధాన్యం. భారీ వర్షం రావడంతో వరదలకు పలు చోట్ల కొట్టుకుపోయింది ధాన్యం. ఇక చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు నేలరాలాయి మామిడి కాయలు. చేతికొచ్చే మామిడి నేల రాలడంతో దుఃఖంలో రైతన్నలు ఉన్నారు. ఇదే పరిస్థితి తెలంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version