హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లే వారికి శుభవార్త

-

హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లే వారికి శుభవార్త. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేశారు దక్షిణ మధ్య రైల్వే శాఖ. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఐదు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

అక్టోబర్ 19న సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు (07485),20న తిరుపతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (02763), 21న సికింద్రాబాద్-సంత్రగచ్చి ప్రత్యేక రైలు (07645), 22న సంత్రగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07646), అక్టోబర్ 18న నరసాపూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07169) ను నడుపుతున్నట్టు అధికారులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news