రైలులో భద్రాచలానికి గవర్నర్‌ తమిళిసై.. అటు ఏరియల్‌ సర్వేకు సీఎం కేసీఆర్‌

భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి ఉంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 65.1 అడుగులకు చేరింది నీటిమట్టం. అయితే.. ఈ వరదల కారణంగా భద్రాచలంలో చాలా ఇండ్లు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే.. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లనున్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై రైలు మార్గం ద్వారా.. భద్రాచలం వెళ్లనున్నారు గవర్నర్‌.

ఇక ఇవాళే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 07.00 – 07.45 గంటలకు వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి భద్రాచలం ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

ఇక 09.30 గంటలకు భద్రాచలంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌. 09.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా ఏటూరునాగారం వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన ఉండనుంది. 11.00 గంటలకు ఏటూరునాగారం ఐటీడీ ఏలో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.