తెలంగాణ విద్యార్థులకు ఝలక్ ఇచ్చిన సర్కార్..

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి.ఏపీలో సజావుగా పరీక్షలు జరుగుతుండగా, తెలంగాణాలో మాత్రం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.తెలంగాణ ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లుతుండడంతో ఇంటర్‌బోర్డు అధికారులు వాటిని గుర్తించారు. ఇప్పుడు ప్రశ్నా పత్రాలను మార్చలేని పరిస్థితి..కనుక విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో సరిదిద్దుకోని రాసేలా చూడాలని పరీక్షా కేంద్రాల్లోని అధికారులకు షార్ట్‌ మెసేజ్‌లు పంపిస్తున్నారు. మే 6 న ప్రారంభమైన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ సంస్కృతం పేపర్‌లో రెండు మార్కుల ప్రశ్నలు 2 పునరావృతమయ్యాయి. అరబిక్‌లోనూ ఒక ప్రశ్నలో అక్షర దోషాలు వచ్చాయి.

సెకండియర్‌ పరీక్షలు మే 7న ప్రారంభమవగా తెలుగు క్వశ్చన్‌ పేపర్‌లోని 10వ ప్రశ్నలో ప్రత్యేకత బదులు ‘ప్రత్యేక’ అని ప్రచురితమైంది. రెండో ప్రశ్నలో చినుకులు బదులు ‘చినుకుల’ అని ముద్రితమైంది. ఉర్దూ సబ్జెక్టులో గుల్‌దాన్‌ బదులు ‘గుల్‌దన్‌’ అని వచ్చింది..వాటిని ఇన్విజిలేటర్లు చదివి వినిపించారు.జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒక విద్యార్థినికి సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు. ఆ విషయాన్ని పరీక్ష రాసిన అనంతరం ఆ విద్యార్థిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి తండ్రికి చెప్పింది. ఆయన ఈ విషయాన్ని పరీక్ష కేంద్రం సిబ్బంది, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో అక్కడ బాధ్యులైన యాజమాన్యానికి, ఇన్విజిలేటర్ లకు నోటిసులు పంపారు..ఇంటర్‌ సెకండియర్‌ ద్వితీయ భాషకు మొత్తం 4,37,865 మందికిగాను 4,16,964 మంది హాజరయ్యారు. మాస్ కాఫీ కొడుతూ హైదరాబాద్ తో సహా మూడు జిల్లాల్లొ ఒక్కొక్కరూ డిబార్ అయ్యినట్లు అధికారులు తెలిపారు.ముగ్గురు విద్యార్థులు పరీక్షకు నిర్ణీత సమయం దాటాక రావడంతో వారిని అధికారులు పరీక్ష హాలులోకి రానివ్వలేదు..మొత్తానికి తెలంగాణ లో ఇంటర్ పరీక్షలు గందరగోళంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news