దక్షిణాదిపై బీజేపీ సర్కార్ కి చిన్నచూపు – హరీష్ రావు

-

కేంద్ర ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి హరీష్ రావు. నేడు పఠాన్ చెరువులో ఫ్రీడమ్ పార్క్, డీసీసీబీ, ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులను మార్చినా, అవుట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా వచ్చే ఎన్నికలలో విజయం బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అని అన్నారు హరీష్ రావు.

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. తెలంగాణకు రావలసిన నిధుల్ని కేంద్రం ఇవ్వడం లేదని.. దక్షిణాదిపై బీజేపీ సర్కార్ కి చిన్న చూపు అని ఆరోపించారు ప్రజల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఆల్ రిజెక్ట్ లీడర్లను, స్క్రాబ్ రాజకీయ నేతలను, పక్కకు పెట్టిన వారిని పార్టీలోకి తీసుకొని ప్రతిపక్ష పార్టీలు జబ్బలు చరుచుకోవడం సిగ్గుచేటని అన్నారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version