తెలంగాణ మెడికల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి హరీష్ రావు. కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలలో తెలంగాణ విద్యార్థులకే బీ కేటగిరి సీట్లు ఇస్తామని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ- ఎపి విడిపోయినప్పుడు మెడికల్ కాలేజీలు ఆంధ్రలో ఎక్కువ..తెలంగాణలో తక్కువ అని గుర్తు చేశారు.
ఇవాళ సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ…. 10 సంవత్సరాల వరకు ఎపి విద్యార్థులు…తెలంగాణలో చదువుకునే ఆవకాశం ఉందన్నారు. ఇప్పుడు మన దగ్గర మెడికల్ కాలేజీలు ఏక్కువ..కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఉన్న 5 మెడికల్ కాలేజీలలోనే ఎపి విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి మిగతా మెడికల్ కాలేజీలలో B కేటగిరి సీట్లన్ని తెలంగాణ విద్యార్థులకే వచ్చేలా చేస్తున్నామని వెల్లడించారు మంత్రి హరీష్ రావు. దీనిపై ఓ వారంలో జీవో విడుదల చేస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.