భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్ నిర్వహణ, వరద ముంపు నివారణపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ సరాఫర స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇది ఇలా ఉంటే….ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పిడుగుపాటుతో తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు మరణించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది.
నేడు మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, హైదరాబాద్, గద్వాల్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50KM వేగంతో ఈదురు గాలులు విస్తాయని తెలిపింది. మిగతా రోజుల్లో వానలు కురిసే జిల్లాల జాబితాలను తెలిపింది.