తెలంగాణలో తీసుకువచ్చిన హైడ్రా అనేది ప్రతిపక్ష నాయకుల ఆస్తులను ధ్వంసం చేసేందుకు తీసుకువచ్చినట్లుగా ఉందని తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఎఫ్ టి ఎల్ అలాగే బఫర్ జోన్ లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. లబ్ధిదారులు… జిహెచ్ఎంసి అధికారుల రూల్స్ ప్రకారమే తమ ఫార్మ్ హౌస్ లు గానీ లేదా ఇండ్లను కానీ కట్టుకున్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులపై మొదటగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి చురకలాంటి ఇచ్చింది హైకోర్టు.
దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న కావూరి హిల్స్ కాలనీలో కొన్ని నిర్మాణాలకు హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన హైదరాబాద్ సీరియస్ అయింది హైకోర్టు న్యాయస్థానం. హైదరాబాద్ మహానగరంలో లక్ష అనధికార నిర్మాణాలు ఉన్నాయని… వారందరికీ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని కూడా నిలదీసింది. అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తున్నారో చెప్పాలని కూడా తెలిపింది. గులాబీ పార్టీ నేతల నిర్మాణాలను ఎందుకు మొదటగా ధ్వంసం చేస్తున్నారని కూడా ఆ ప్రశ్నించింది. దీనిపై వెంటనే సమాధానం చెప్పాలని కూడా తెలిపింది.