మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై నేడు హైకోర్టు తీర్పు

-

 

Minister Srinivas Goud : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదం పై నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో ఇరువాదనలు పూర్తి అయ్యాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని ఓటరు రాఘవేంద్రరాజు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో ఆఫీడవిట్ ట్యాంపరింగ్ చేసారని ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ పిటీషన్ వేశారు.

High Court’s verdict on Minister Srinivas Goud’s election dispute today

అయితే…ఈ వివాదంపై గతంలో అడ్వకేట్ కమీషన్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. దీంతో అడ్వకేట్ కమీషన్ ముందు నేరుగా హజరై వివరణ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కు నివేదిక సమర్పించింది అడ్వకేట్ కమిషన్. ఇలాంటి తరుణంలోనే.. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదం పై నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version