35 ఏళ్ల తర్వాత మరో కీలక ఘట్టం.. ఒకేసారి గణేశ్‌ ఉత్సవాల చివరి రోజు, మిలాద్‌ ఉన్‌ నబీ

-

హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో 35 ఏళ్ల తర్వాత మరో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. భద్రతాపరంగా అత్యంత కీలక ఘట్టానికి సీపీ సీవీ ఆనంద్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడున్నర దశాబ్దాల తర్వాత మిలాద్‌ ఉన్‌ నబీ, గణేశ్‌ నిమజ్జనాల చివరి రోజు ఒకే రోజు రానున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా ఆరంచెల భద్రతా ప్రణాళిక అమలుచేయాలని పోలీసులు నిర్ణయించారు. నగరంలోని అన్ని జోన్ల పోలీసు అధికారులతో ఆదివారం రోజున బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి సీవీ ఆనంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరంచెల భద్రతా ప్రణాళిక, రోడ్‌మ్యాప్‌ను వివరించారు. ఆరు దశల భద్రతా ప్రణాళికలో భాగంగా బందోబస్తు, ట్రాఫిక్‌ సమస్యపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను వివరించారు.

‘మిలాద్‌ ఉన్‌ నబీ, గణేశ్‌ నిమజ్జనం సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టాలి. సీనియర్‌ అధికారులు అసాంఘిక శక్తుల్ని గుర్తించేందుకు తనిఖీల్లో పాల్గొనాలి. ఫ్లాగ్‌ మార్చ్‌లు, సామాజిక మాధ్యమాల్లో విద్వేష పోస్టులపై దృష్టిపెట్టాలి.’ అని సీపీ సీవీ ఆనంద్ అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version