సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి హైడ్రా నోటీసులు !

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కుటుంబాన్ని కూడా హైడ్రాధికారులు వదలడం లేదు. తాజాగా దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రాధికారులు… సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇంటికి నోటీసులు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అందించడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి అద్దె ఇంట్లో ఉంటున్నారు.

Hydra aggression Notices to CM Revanth’s brother’s house

అయితే ఆ ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు దుర్గం చెరువును ఆనుకొని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ అలాగే డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు అందించారు హైడ్రా అధికారులు. నెలరోజుల్లోగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. దింతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version