కులగణనపై విపక్షాలది దుష్ప్రచారం మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా గాంధీ భవన్ లో కులగణన పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.మోడీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదు. రాష్ట్రంలో కులగణన పారదర్శకంగా చేశామని తెలిపారు. ప్రణాళిక ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తున్నామని తెలిపారు. కేసీఆర్ లాంటి వాళ్లు బలిసి కులగణన సర్వేలో పాల్గొనలేదు.
కొంత మంది అందుబాటులో లేక పాల్గొనలేదు. మొత్తం 3.1 శాతం మంది కులగణనలో పాల్గొనలేదని తెలిపారు. మైనార్టీ లెక్కలను ఎలా తీశారని కొందరూ ప్రశ్నిస్తున్నారు. బీసీ-ఈ గ్రూపు కింద 4 శాతం రిజర్వేసన్ ఉంది కాబట్టే మైనార్టీల లెక్క తేల్చామని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ఇంటి ముందు మేల్కొలుపు డప్పు కొట్టండి. లేకపోతే సామాజిక బహిష్కరణ శిక్ష విధించండి. కేటీఆర్, కేసీఆర్ కుటుంబం సర్వే చేయించకపోతే సామాజిక బహిష్కరణ చేయండి అని సూచించారు. మోడీ, కేడీలు బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు.