కులగణన తప్పు అయితే ఎక్కడ తప్పు ఉందో చూపించండి అని బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాజాగా ఆయన అధ్యక్షతన బీసీ నేతలతో ప్రజాభవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి. దానిని మీరు కాపాడుకోకపోతే మీకే నష్టం అని క్లాస్ తీసుకున్నారు. కట్టే పట్టుకొని కాపాడుకోండి. అంతా రేవంత్ రెడ్డే చూసుకుంటాడు. దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని తెలిపారు.
రాహుల్ గాంధీ హామీ మేరకే చిత్తశుద్ధితో పని చేస్తున్నానని చెప్పారు. బీసీల సంఖ్య గతంలో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారు. కేసీఆర్ లెక్కల ప్రకారం.. 51 శాతం.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 56.33 శాతానికి పైగా ఉన్నారు. మేము అత్యంత పకడ్బందీగా సర్వే నిర్వహించామన్నారు. ఇంటి యజమానులు చెప్పిన లెక్కలే మా దగ్గర ఉన్నాయి. 1.12 కోట్ల కుటుంబంలో సర్వేలో పాల్గొన్నాయని పేర్కొన్నారు.