సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వద్ద గాల్లోనే చక్కర్లు కొట్టి చివరకు అక్కడే సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. ఆ సమయంలో ఫ్లయిట్ లో పైలట్లు సహా మొత్తం 12 మంది ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంలో హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాలేదు.
ఎంత ప్రయత్నించినా వీల్స్ ఓపెన్ కాకపోవడంతో టెన్షన్ నెలకొంది. దీంతో గంటకుపైగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఆ విమానం గాల్లో చక్కర్లు కొడుతూ సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించింది. హకీంపేట, బేగంపేట్ లో ఎక్కడ ల్యాండింగ్ చేస్తే సేఫ్ అనే దానిపై ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. చివరకు అధికారులు, పైలట్ల ప్రయత్నంతో బేగంపేట విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ప్లూయల్ అయిపోయేంత వరకు కూడా గాలిలో చక్కర్లు కొట్టాలని ఎయిర్ ఫోర్టు అధికారులు సూచించడంతో కేవలం ల్యాండింగ్ కి మాత్రమే సరిపడ ప్యూయల్ ఉంచి దాదాపు మూడు గంటల వరకు బేగంపేట విమాశ్రయం సమీపంలో చక్కర్లు కొట్టింది.