IRCTC Ooty Tour Package : ఈ మాన్సూన్లో ఊటీ అందాలు చూసొస్తారా?

-

ఈ వర్షాకాలంలో ప్రకృతి అందాలకు పుట్టినళ్లయిన ఊటీలో విహరించాలనుకునే వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ సూపర్ ప్యాకేజీని అందిస్తోంది. “అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్” పేరిట ఐఆర్సీటీసీ ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ట్రైన్ ద్వారా జర్నీ ఉంటుంది. ఈ టూర్‌ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ఈ టూర్ జులై 30 నుంచి సెప్టెంబర్ 24వరకు అందుబాటులో ఉంది. మరి, ఈ ప్యాకేజీ వివరాలు మీ కోసం.

1వ రోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.17230) బయల్దేరుతుంది.

2వ రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌ చేరిన తర్వాత అక్కడ నుంచి ఊటీకి ఐఆర్‌సీటీసీ సిబ్బంది తీసుకెళ్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్లో చెకిన్ అవ్వాలి. సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు వీక్షించొచ్చు.

3వ రోజు ఉదయం హోటల్‌లోనే బ్రేక్ఫాస్ట్ అనంతరం దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా జలపాతాన్ని వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది.

4వ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం కూనూర్‌ పర్యటనకు వెళ్లి సాయంత్రం ఊటీకి చేరుకుంటారు.

5వ రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్ఫాస్ట్ చేశాక ఊటీ నుంచి కోయంబత్తూర్‌ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి సాయంత్రం 03:55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెం:17229) హైదరాబాద్కు స్టార్ట్ అయి రాత్రంతా జర్నీ చేయాల్సి ఉంటుంది.

ఆరో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు

కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి.. సింగిల్ షేరింగ్కు రూ.28,940, ట్విన్ షేరింగ్‌కు రూ.16,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,380 చెల్లించాలి. 5 – 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.9,100, విత్ అవుట్ బెడ్ అయితే రూ.8,850.

(స్లీపర్‌ బెర్త్‌) సింగిల్ షేరింగ్కు రూ.26,480, ట్విన్ షేరింగ్‌కు రూ.13,980, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,930. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.6,640, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,400

Read more RELATED
Recommended to you

Exit mobile version