హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నగరంలోని పలు కంపెనీలతోపాటు వాటి యజమానుల ఇళ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తనీఖీల్లో 100 బృందాలు పాల్గొంటున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లిలోని హిందూ ఫార్చ్యూన్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అమీర్‌పేటలోని పూజాకృష్ణ చిట్ ఫండ్ యజమాని ఇల్లు, కార్యాలయంలోనూ సోదాలు జరుపుతున్నారు. వ్యాపారవేత్తలు ప్రసాద్‌, కోటేశ్వరరావు, రఘువీర్‌, వజ్రనాథ్‌ ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.

మరోవైపు.. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీ ఎస్‌. జగత్‌రక్షకన్‌ ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జగత్‌రక్షకన్‌కు చెందిన విద్యాసంస్థల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. పలు హోటళ్లు, ప్రైవేట్‌ దవాఖానలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version