తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ రెండో జాబితా విడుదలైన విషయం తెలిసిందే. ఈ జాబితా విడుదల కాగానే టికెట్ దక్కని వారు అసంతృప్తితో ఉన్నారు. మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన చలమల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అదే బాటలో జంగా రాఘవరెడ్డి కూడా నడవనున్నారని తెలుస్తోంది.
జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. టికెట్ వస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్న జంగాకు అధిష్టానం ఒక్కసారిగా హ్యాండ్ ఇచ్చింది. జంగా రాఘవరెడ్డిని కాదని నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. టికెట్ రాకపోవడంతో జంగా రాఘవరెడ్డి కంటతడి పెట్టారు. ముఖ్య నాయకులతో అత్యవసరంగా సమావేశమై పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ వైపునకు వెళ్లాలా..? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలా అని ఆలోచన చేస్తున్నారు జంగా రాఘవరెడ్డి. భవిష్యత్ కార్యచరణపై అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు జంగా. ఇక ఆ తరువాత ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరీ.