నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్..ఈ నెలాఖరుకే 60 వేల ఖాళీల భర్తీ !

-

తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్తే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఖాళీల భర్తీ కోసం అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా… అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ కార్యాలయ కార్యదర్శి శేషాద్రి నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల స్మిత సబర్వాల్, దివ్య, లోకేష్ కుమార్ సభ్యులుగా ఏర్పాటైన కమిటీ అందుకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే దాదాపు ఆరువేల ఖాళీలను గుర్తించారు. మరోవైపు కొత్త జీవన విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యింది.

స్పౌస్ కేసులు, అభ్యంతరాలకు సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉంది. అయితే ఖాళీలు ఉంటేనే spouse కేసులను పరిగణలోకి తీసుకున్నారు. ఏదేమైనా ఈ నెల ఆఖరు లో 60 వేల ఖాళీల భర్తీపై కీలక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెబుతున్నారు.

 

NOTE : 

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version