కంటి వెలుగులో భాగంగా కోటిన్నర మందికి పరీక్షలు, 55 లక్షల మందికి ఉచితంగా అద్దాలు అందిస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.జనవరి 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే కంటి వెలుగు -2 కార్యక్రమం పై డీఎంహెచ్వొలు, డిప్యూటీ డిఎంహెచ్వొలు, క్వాలిటీ టీమ్స్, ప్రోగ్రాం ఆఫీసర్లకు ఎంసిఆర్ హెచ్ఆర్ డి లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు.1.54 కోట్ల మందికి స్క్రీనింగ్, 50 లక్షల కళ్ళ అద్దాలు ఇవ్వడం జరిగిందన్నారు. వరల్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రాంగా ఇది నిలిచింది.ప్రజల కంటి సమస్యలు తొలగించేలా ఇప్పుడు మరో మారు కార్యక్రమం మొదలు పెట్టామని చెప్పారు. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించాము.ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్.మరోసారి అందరం కలిసి ఉత్సాహంగా పని చేద్దామనిపిలుపు ఇచ్చారు.