తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. వారిద్దరికీ గ్రూప్-1 ఉద్యోగం

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో కేబినెట్ భేటీ జరిగింది.  ఈ భేటీలో జాబ్ క్యాలెండర్, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ కి గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు వంటి వాటిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. చర్చల అనంతరం నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ కి గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు.

ఇటీవల భారత జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించిన విషయం తెలిసిందే. కప్ సాధించిన తర్వాత హైదరాబాద్ కి వచ్చిన సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. భారత జట్టులో మన రాష్ట్రానికి చెందిన ఆటగాడు ఉండటం గర్వకారణం అని సీఎం ప్రశంసించి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ కి సైతం ఇంటి స్థలం, గ్రూపు-1 ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ కేబినెట్లో ఈ అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version