టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో కూడా కలిశాయని… ఇప్పడు కలిసినా మాకు అభ్యంతరం లేదని అన్నారు బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని…విష ప్రచారం, కుట్రలు చేస్తున్నారని… తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెబుతారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కోటాను ఫిక్స్ చేసుకుని బీజేపీ నాయకులను తిడుతున్నారని…ఒక్క రోజు తిట్టకపోయినా ప్రగతి భవన్ నుంచి ఆపార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఫోన్లు వస్తున్నాయని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ పార్టీ ధోరణి మారిందని, కుట్రలు, కుతంత్రాలు పెరిగాయని ఆరోపించారు. ఏమాత్రం నైతిక విలువలు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని…ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబంలో అభద్రతా భావం పెరిగిందని… అందుకే ప్రధాని మోదీని, గవర్నర్ ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకు కారణం హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి ఫలితంగానే టీఆర్ఎస్ భయపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ లు గతంలో కలిశాయి… ఇప్పుడు కలిసినా అభ్యంతరం లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-