బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదు – కిషన్‌ రెడ్డి

-

బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదని కిషన్‌ రెడ్డి ప్రకటించారు. కవిత అరెస్టు పై కిషన్ రెడ్డి మాట్లాడుతూ…కేసీఆర్ కూతురు నేడూ ఈడీ ముందు విచారణ ఎదుర్కొంటుంది…బీజేపీకి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం లో జరిగిన అవినీతి అని…తెలంగాణా ప్రజలకు ఆదాయం తెచ్చేందుకు కవిత ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం చేశారా అంటూ నిలదీశారు. ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం పై విచారణ చేస్తే కవిత పేరు వచ్చింది…కవిత అరెస్టు అయితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, మోదీ దిష్టి బొమ్మ దగ్దం చేసేస్తున్నారని ఫైర్‌ అయ్యారు కిషన్‌ రెడ్డి.

kishan reddy on kavitha

గతంలో మధ్య నిషేధం చేస్తాం అని చెప్పి ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం చేస్తుంది….బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యం అమ్మకాలతో పేదల రక్తం తాగుతోందని వివరించారు. బీనామీ పేర్లతో వ్యాపారం చేశారు, ఆధారాలను ధ్వంసం చేసి బీజేపీ పై ఆరోపణలు చేస్తున్నారు…అవినీతి కి పాల్పడితే బీజేపీ కార్యకర్తలు అయిన విపక్షాల నేతలైనా విచారణ ఎదుర్కోవాలని కోరారు. కవిత అనుచరులు, బినామీలను విచారిస్తే కవిత పాత్ర ఉందని తేలింది…విచారణ కు పిలిస్తే సహకరించకుండా మొండికేసిందని….అందుకే ఇప్పుడు అరెస్టు అయ్యిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version