కోమటిరెడ్డి రెడీ అంటా!ఆ వెనుకే కాంగ్రెస్‌లోకి బడా నేతలు?

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా భారీ వలసలు కొనసాగనున్నాయా? జూపల్లి జాయినింగ్ తర్వాత ఇంకా వలసలు కొనసాగుతాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. కీలక నేతలు ఆ పార్టీలోకి వస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ సభ ఖమ్మంలో జరిగింది. ఆ సభలో పొంగులేటి సహ చాలామంది కీలక నేతలు భారీగా కాంగ్రెస్ లో చేరారు.

ఇక జూపల్లి కృష్ణారావు..కొల్లాపూర్ లో జరిగే ప్రియాంక గాంధీ సభలో జాయిన్ అవ్వనున్నారు. ఆయనతో పాటు చాలామంది కీలక నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. అయితే బి‌జే‌పి నుంచి కూడా బడా నేతలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో బి‌జే‌పిలో చేరి…మునుగోడు ఉపఎన్నికలో ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బి‌జేపి బలం లేకపోవడం,.ఆ పార్టీలో అంతర్గత పోరు..కీలక పదవి ఏమి రాకపోవడంతో కోమటిరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారట.

ఈ క్రమంలోనే తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రహస్యంగా మంతనాలు జరిపారు. దీంతో ఆయన కాంగ్రెస్ లోకి రావడం ఖాయమని తెలుస్తుంది. అటు రేవంత్ సైతం కోమటిరెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కోమటిరెడ్డి మాత్రమే కాదు.. ఆ బాటలోనే మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె పైకి తాను పార్టీ మారడం లేదని ఖండిస్తున్నా అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు విజయశాంతి సైతం బి‌జే‌పిపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

వీరిద్దరు గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు. అయితే డి‌కే అరుణకు జూపల్లికి కాంగ్రెస్ లో ఉండగానే పడేది కాదు. అటు రేవంత్ రెడ్డితో కూడా డి‌కే అరుణకు ఒకప్పుడు పొసగ లేదు. మరి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లోకి వస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news