ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు విపక్షాలు వస్తాయి : కేటీఆర్

-

ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు విపక్షాలు వస్తాయి బీఆర్ఎస్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. తొమ్మిదిన్నరేళ్లలో రెండేళ్లు కరోనాతో వృథా అయిపోయాయని చెప్పారు. మళ్లీ అధికారం ఇస్తే.. మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు.

బీడీ కార్మికులకు పింఛను ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. బీడీ కార్మికులకు ఇంకా కొంతమందికి పింఛను రావాలి… అందరికీ వచ్చేలా చూస్తాం. డిసెంబర్‌ 3 తర్వాత అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. కాంగ్రెస్‌ నేతల మాటలు నమ్మెుద్దు. 65 ఏళ్లలో కాంగ్రెస్‌, బీజేపీ చేయని పనులను బీఆర్ఎస్ పూర్తి చేసింది. అని కేటీఆర్ అన్నారు.

రైతులకు 3 గంటల కరెంట్‌ చాలు అని రేవంత్‌ రెడ్డి అంటున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో రూ.200 పింఛను ఇవ్వలేనివాళ్లు ఇప్పుడు రూ.2 వేలు ఇస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు 11 ఛాన్సులు ఇచ్చారని…. మళ్లీ ఇప్పుడొచ్చి ఒక ఛాన్సు అడుగుతున్నారని మండిపడ్డారు. మోదీ పెంచిన సిలిండర్‌ ధర తగ్గించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version