NDA సర్కార్ అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉంది : కేటీఆర్

-

రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ సర్కార్ అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో చోటే భాయ్‌ మోసం చేశారని, 2014లో బడా భాయ్‌ మోసం చేశారని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు. వేములవాడలో బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

“రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. రైతుల కష్టాలు మాత్రం రెట్టింపు అయ్యాయి. ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరుతో మోసం చేశారు. జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ హామీలు నెరవేర్చలేదు. పదేళ్లలో దేశ ప్రజలకు తీరని ద్రోహం చేశారు.” అని కేటీఆర్ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version