సిలిండర్ ధరలు పెంపు.. ఇది ప్రధాని గిఫ్ట్ అంటూ కేటీఆర్ సెటైర్లు

-

సామాన్యులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరపై రూ. 50 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1055 లు ఉండగా దీనిపై రూ. 50 అదనంగా పెంచడంతో రూ.1105కు చేరింది. దీంతో సామాన్యులపై పెనుభారం పడనుంది. అయితే సిలిండర్ ధరలు పెంచడంపై మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు.

దేశంలోని మహిళలకు సిలిండర్ ధరలు పెంచి మోడీ సర్కార్ గిఫ్ట్ ఇచ్చిందని సెటైర్లు పేల్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు మంత్రికి కేటీఆర్. కాగా ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతూ అన్న సామాన్య ప్రజలకు ఇంధన కంపెనీలు మరో షాక్ ఇవ్వడంతో తేలుకోలేకపోతున్నారు.

నాలుగున్నర కేజీల సిలిండర్ తో పాటు ఐదు కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర కూడా పెరిగింది. చిన్న సిలిండర్ పై 18 రూపాయల మేర పెరిగింది. అయితే కొంత ఊరటగా వాణిజ్య అవసరాలకు వాడే కమర్షియల్ ఎల్పీజీ ధరలు మాత్రం తొమ్మిది రూపాయల మేర తగ్గాయి. ఇక హైదరాబాదులో 1055 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర బుధవారం నుంచి 1105 కానుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news