పార్లమెంట్ లో పేదల తరుపున మాట్లాడే నేతలు తగ్గిపోయారు : సీఎం రేవంత్ రెడ్డి

-

ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘Prophet for the world’ పుస్తకావిష్కరణలో పాల్గొని మాట్లాడారు సీఎం.  భగవద్గీత, బైబిల్, ఖురానక్ సాంరాంశం ప్రపంచ శాంతి మాత్రమేనని.. కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి  చేసుకోవాలని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయన్నారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. 

గతంలో హైదరాబాద్ లో ఓ వైపు ఒవైసీ, మరోవైపు తాను ఎంపీగా ఉన్నామన్నారు. ఒవైసీ కొన్ని సార్లు కాంగ్రెస్ పై కూడా విమర్శలు చేశారని.. మంచి ప్రభుత్వాన్ని నడపాలంటే మంచి ప్రతిపక్షం కూడా ఉండాలన్నారు. పార్లమెంట్ పేదల తరపున మాట్లాడే నేతలు తగ్గిపోయారని.. కార్పొరేట్ రంగంలో, వ్యాపారాల్లో మన వాళ్లు అగ్రగామిగా ఎధుగుతున్నారని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ లో పేదల కోసం మాట్లాడే వారిలో అసదుద్దీన్ ఒవైసీ ఒకరు.. ఎన్నికలు ముగిసే వరకే రాజకీయాలు.. ఆ తరువాత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం అంతా కలిసి పని చేయాలి. ఎంఐఎం నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version