మూసీ పేరుతో లూటీ చేస్తున్నారు : కేటీఆర్

-

మూసీ పేరుతో లూటీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో తాజాగా ఆయన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు.  మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. నాచారం, ఉప్పల్ లో మేమే మూసీ సివరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారు. కొత్తగా లక్ష 50వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. నల్లగొండకు నీరు ఇవ్వడం ఇష్టం లేదా..? అని ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కేది కాదు.. పనికి మాలిన మాటలు అన్నారు. 

KTR

దాదాపు 50 ఏళ్ల నుంచి కొంత మంది నివాసం ఉంటున్నారు. గరీబోల్లకు నష్టం కాకుండా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. మనస్సు ఉన్న ముఖ్యమంత్రి ఉంటే మంచి జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా మూసీ సుందరీకరణ చేశామని తెలిపారు. పేదలకు అన్యాయం జరుగకుండా చేశామని తెలిపారు. సివరేజ్ ప్లాంట్స్ పూర్తి అయితే దిగువనకు శుద్ధి చేసిన నీళ్లు వెళ్తాయని తెలిపారు కేటీఆర్. మూసీ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నల్గొండకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని సీఎం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బిల్డర్లు, పెద్ద వ్యాపారులను బెదిరించేందుకే హైడ్రా ను తీసుకొచ్చారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version