మే నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..3 వేల కోట్లు క్రాస్

-

తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. కేవలం మే నెలలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత నెల కన్నా మద్యం అమ్మకాలు సేల్స్ భారీగా పెరిగిపోయాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచినా.. తగ్గలేదు అమ్మకాలు. మద్యమే పరమావధిగా మందుబాబులు తెగ తాగేస్తున్నారు.

ఏప్రిల్ నెలలో 27 లక్షల 92 వేల 721 లిక్కర్ కేసులు డిపోల నుండి అమ్ముడు కాగా 49 లక్షల 92వేల 697 బీర్ కేసులు అమ్ముడు పోయాయి. ఏప్రిల్ నెలలో మొత్తం 2,701 కోట్ల అమ్మకాలు డిపోల నుండి జరిగాయి. ఈ నెలలో డిపోల నుండి మద్యం అమ్మకాలు మూడు వేల కోట్లు దాటాయి. 29,54,149 కేసుల లిక్కర్ అమ్మకాలు జరగగా…55 లక్షల 70 వేల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలోని తీసుకున్న నిర్ణయం ప్రకారం…ఈ నెల 19 న పెరిగాయి మద్యం ధరలు. మద్యం ధరలు పెరిగినప్పటికీ… మే మాసంలో తెలంగాణ రాష్ట్రంలోని మద్యం డిపోల నుండి 3069.3 కోట్ల అమ్మకాలు జరిగాయి. మద్యం ధరల పెంపు.. సేల్స్ పైన ఎలాంటి నెగటివ్ ప్రభావం పడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version