ఆర్అండ్ బీ సెక్షన్ లో మంత్రి కోమటిరెడ్డి అకస్మిక తనిఖీలు..!

-

ఆర్ అండ్ బీ సెక్షన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయంలో ఉద్యోగుల పనితీరును తెలుసుకునేందుకు  వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. ఆర్ అండ్ బీ విభాగంలో  అకస్మికంగా తనిఖీ చేయగా ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో షాక్ కి గురయ్యారు. సమయం దాటినా చాలా మంది ఉద్యోగులు కార్యాలయానికి రాకపోవడంతో మంత్రి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు కార్యాలయానికి రిపోర్టు చేయాలి.

కానీ తెలంగాణ సచివాలయంలో ఉదయం 11.00 గంటలు అయిన 80 శాతం ఉద్యోగులు ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి  కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిస్టెంట్, అడిషినల్ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై ప్రశ్నించారు. 11కి రాలేదు.. మళ్లీ 6కి వెళ్లిపోతారు.. మళ్లీ మధ్యలో ఆఫ్ అంటూ.. అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు పలు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి.. కొన్ని విషయాలపై అధికారులు స్పందించకపోవడంతో మీ వివరాలు కూడా మీకు తెలుసా? అంటూ ఫైర్ అయ్యారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే కొనసాగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మంత్రి వచ్చిన ఇప్పటి వరకు ఉద్యోగులు రాకపోవడం ఏంటని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version