జగిత్యాలలో సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల

ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు జగిత్యాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, పార్టీ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. అయితే గులాబీ గర్జన సభ ప్రాంగణాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఆయన వెంట కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వెంకటేష్ నేత, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.