కెసిఆర్ కుటుంబ పాలనను అంతమందించడమే తన లక్ష్యమని అన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్లగొండ జిల్లాచౌటుప్పల్ లో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వందలసార్లు అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించానని కానీ ఒక్క సమస్య కూడా ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు.విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఎందుకు ఈ వివక్ష అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట నిధులు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
![Komatireddy Rajagopal Reddy | Munugode constituency MLA](https://cdn.manalokam.com/wp-content/uploads/2021/07/rajagopal-Reddy.jpg)
అభివృద్ధి సిరిసిల్లకు, గజ్వేల్ కు పరిమితం అయితే మునుగోడు తెలంగాణలో లేదా? మునుగోడు ప్రజలు ఉద్యమం చేయలేదా? అంటూ మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి.మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటే ఉప ఎన్నికలు వస్తాయన్నారు.ఉప ఎన్నికలు వస్తే ఆ తీర్పు కేసీఆర్ పతనానికి నాంది అవుతుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని, కుటుంబ పాలనను అంతమందించడమే నా లక్ష్యమని అన్నారు.