ఆసరా పింఛన్లు పెంచాలని రోడ్డెక్కారు వృద్ధులు. పింఛన్ పెంచి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఊసే ఎత్తడం లేదని పండుటాకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గద్వాల రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
ఇక అటు రైతు భరోసా పథకం అమలు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్… కోతలు విధించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించేందుకు… అనర్హులను ఏరి వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది.
ఐటీ చెల్లింపు దారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేసేందుకు… ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోంది. బీడు భూములు, రోడ్లు అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ పథకాన్ని వర్తించకూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.