బిజెపి ఎంపీ ధర్మాపూరి అరవింద్ పై మరో కేసు నమోదు అయింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రభుత్వం పై , ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ , ప్రభుత్వ మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను కించపరిచే విదంగా పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రవికుమార్ అనే న్యాయవాది.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ధర్మపురి అరవింద్ పై 504 , 505(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఇక నిన్న ఇదే విషయమై ధర్మపురి అరవింద్ పై పోలీస్ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పటివరకు కేసీఆర్ పై విరుచుకుపడిన అరవింద్…ఇకపై కేసీఆర్ ని తిట్టనని చెప్పుకొచ్చారు. రాజకీయ విభేదాలే తప్ప…కేసీఆర్ పై వ్యక్తిగత కక్ష ఏమి లేదని అన్నారు. ఇకపై కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడనని అన్నారు. బీజేపీకి గ్రాఫ్ పెరుగుతుందని, అదే సమయంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని, దీంతో కేసీఆర్ మానసిక పరిస్తితి రోజురోజుకూ దిగజారుతోందని అన్నారు. ఏదేమైనా ఇక నుంచి కేసీఆర్ పై పరుష పదజాలం వాడకుండా ఉండటానికి చూస్తానని చెప్పారు.