బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

Twist in son’s case
కాగా, హైదరాబాద్ పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారుతో దూసుకెళ్లి బారికేడ్లు ఢీ కొట్టిన కేసులో నిందితుడికి సహకరించారనే ఆరోపణలతో ఆ సమయంలో పంజాగుట్ట సీఐగా ఉన్న దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం కొంతకాలం పోలీసులు గాలించారు. ఇక తాజాగా అతడిని ఏపీలోని గుంతకల్లులో పట్టుకున్న పోలీసులు హైదరాబాద్కు తీసుకువచ్చి విచారించిన తర్వాత సోమవారం రోజున అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు అయిన మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్ లభించింది.