రాజగోపాల్ రెడ్డికి షాక్.. మునుగోడులో మరోసారి పోస్టర్ల కలకలం

-

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా సాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ మంత్రులు రంగంలోకి దిగుతూ ఉంటే, బిజెపి తరఫున కేంద్ర నేతలు ప్రచారానికి వస్తున్నారు. అటు కాంగ్రెస్ తరపున మాజీ మంత్రులు సీనియర్ లీడర్లు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మునుగోడు బరిలో 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరో షాక్ తగిలింది. మునుగోడులో మరోసారి రాజగోపాల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కంటే ఏ ఒక్క రాష్ట్రమైనా ఎక్కువ ఇస్తుందా చెప్పే దమ్ముందా అని రాజగోపాల్ కు సవాల్ విసురుతూ ఈ పోస్టర్లు ఉన్నాయి. తెలంగాణ 2016 రూపాయిలు ఆసరా, ఒంటరి మహిళ పెన్షన్, 3016 దివ్యాంగుల పెన్షన్ మరియు బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, యూపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ తో పోలుస్తూ ఈ పోస్టర్లు చండూరు పట్టణంలో వెలిశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version