ఇండియా వ్యాప్తంగా.. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి ఐదు రాష్ట్రాల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తి కాగానే.. ధరలు డబుల్ చేసేస్తుంది. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా.. రోజుకు 80 పైసలు కచ్చితంగా పెంచుతున్నారు. అయితే… ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి పోయాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై 95.07 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.81 కు చేరగా డీజిల్ ధర రూ. 95.07 కు పెరిగింది. ముంబై లో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పై 84 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 118.83 , కు చేరగా డీజిల్ ధర రూ. 103.07 కు పెరిగింది. అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 117. 23 కు చేరగా డీజిల్ ధర రూ. 103. 32 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119. 01 కు చేరగా డీజిల్ ధర రూ. 105. 54 కు చేరుకుంది.
Price of petrol & diesel in Delhi at Rs 103.81 per litre & Rs 95.07 per litre respectively today (increased by 40 paise)
In Mumbai, the petrol & diesel prices per litre at Rs 118.83 (increased by 84 paise) & Rs 103.07 (increased by 43 paise). pic.twitter.com/yv6q7yHUWq
— ANI (@ANI) April 4, 2022