జూలై 3న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ…మూడంచెల భద్రత ఏర్పాటు

-

జూలై 3 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ… హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో.. ప్రధాని మోడీ.. పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రశంగిస్తారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీ… పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేస్తోంది పోలీసు శాఖ. ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

మోడీ పర్యటన లో ఉన్నంతసేపు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు… సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ , హెచ్ ఐసిసి, రాజ్ భవన్ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి. రాజ్ భవన్ లో మోడీ బస పై నిర్ణయం తీసుకోనున్నారు ఎస్పీజీ.

రాజభవన్ లో బస చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటున్నారు తెలంగాణ పోలీసులు. జెడ్ ప్లస్ క్యాటగిరి ఉన్న హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే నోవాటెల్ ను తమ ఆధీనంలో కి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news