సిద్దిపేట జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

-

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ (మం) రామారాంలో 16 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు సంగారెడ్డి జిల్లా కృష్ణరెడ్డిపేటలో 13 సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయింది. సిద్దిపేట జిల్లా బేగంపేటలో 12.9 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో 11. సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు హైదరాబాద్ లో పలుచోట్ల నిన్న భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. బాలానగర్ 10.4cm, బొల్లారం 9.6cm, తిరుమల గిరి 9.5cm, వెస్ట్ మరేడుపల్లి 9.3cm, కుత్బుల్లాపూర్ 9.2cm, కూకట్ పల్లి 7.7 cm, ముసాపేట 7.6cm, కొండాపూర్ 7.4cm, మొండా మార్కెట్ 7.2cm, మల్కాజిగిరి 7cm వర్షపాతం నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news