తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

-

ఏపీ – తెలంగాణ మధ్య విద్యుత్ పంచాయితీ ఎప్పటినుంచో నడుస్తోంది. తెలంగాణ నుంచి ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు 30 రోజులలో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను చెల్లించేలా ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఎప్పటినుంచో కోరుతోంది. ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశించింది.

జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలు రూ. 3441.78 కోట్లు, దీనిపై లేట్ పేమెంట్ రూ. 335.14 కలిపి చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ బకాయిలపై ఏపీ ప్రభుత్వం కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ ట్రాన్స్కో బిల్లుల చెల్లింపు పై స్టే విధించింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news